Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోడలు ట్రైలర్ కి నాగార్జున మెచ్చుకోలు!

  • యూటర్న్ సినిమా ట్రైలర్ చూసి సామ్ ని పొగిడిన మామ  
  • నువ్వు సర్ ప్రైజ్ ఇవ్వకుండా వుండవు కోడలా అని ట్వీట్
  • ఎగిరి గంతేసి, ధన్యవాదాలు చెప్పిన సమంత  
కోడలు సమంతపై నాగార్జున మరోసారి ప్రశంసలు కురిపించారు. సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోయే 'యూటర్న్'సినిమా ట్రైలర్ చూసిన నాగార్జున కోడలిని పొగుడుతూ ట్వీట్ చేశారు. 'వావ్.. నువ్వు సర్‌ప్రైజ్‌ ఇవ్వకుండా ఉండవు కోడలా..! మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ నాగ్ ట్వీట్ చేశారు. దీంతో సమంత ఎగిరి గంతేసినంత సంతోషం వ్యక్తం చేస్తూ డాన్స్ చేస్తున్న ఎమోజీలతో, నన్ను ఎప్పుడూ ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్నందుకు మామయ్యకు ధన్యవాదాలు అని ప్రతిస్పందనగా ట్వీట్ చేసింది.

నాగచైతన్య కూడా 'నా లేడీ కొత్త సినిమా యూటర్న్ ఆమె పరిధిని దాటి నటిగా రాణించడం సంతోషంగా వుంది' అంటూ ట్వీట్ చేశాడు. ఇక రానా అయితే, 'చక్కగా నటించావు సమంత' అని మెచ్చుకున్నాడు. మొత్తం మీద పవన్‌ కుమార్‌ దర్శకుడిగా సామ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘యూటర్న్‌’ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌, భూమిక ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Nagarjuna
Samantha

More Telugu News